తొగుట : నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటామని మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొంగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన బండాకాడి సత్తమ్మ (80)అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న రాంరెడ్డి సర్పంచ్ బండారి కవిత, స్వామిగౌడ్ తో కలిసి ఆమె భౌతిక కాయనికి నివాళులు అర్పించారు.
వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.3000 ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాచోళ్ల లింగం, గ్రామ పార్టీ అధ్యక్షుడు పులిగారి శివయ్య, వార్డు సభ్యులు జహంగీర్, మిద్దె శ్రీనివాస్, నాయకులు పిట్ల వెంకటయ్య, పాత్కుల బాలేష్, బెజ్జనమైన శ్రీనివాస్, ఎర్రోళ్ల చంద్రం, పులిగారి నర్సింలు, వడ్డె నర్సింలు, టంకరి లింగం, పాత్కుల స్వామి, కంకణాల స్వామి, పర్శరాములు, తదితరులు ఉన్నారు.