తొగుట : తొగుట మండలంలోని కాన్గల్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాసిరెడ్డి గారి రాంభూపాల్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి గారి మాతృమూర్తి అనసూయమ్మ మరణం బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి కాన్గల్లో అనసూయమ్మ భౌతిక కాయనికి నివాళిలు అర్పించ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు చిలువేరి మల్లారెడ్డి, బక్క కనకయ్య, బోధనం కనకయ్య, వేల్పుల స్వామి, మాదాసు అరుణ్ కుమార్, మంగ నర్సింలు, యాదగిరి, తగరం అశోక్, రాంబాబు, నరేందర్ తదితరులు ఉన్నారు.