రాయపోల్, ఏప్రిల్ 03 : దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో ప్రతీ సంవత్సరం జరుగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు గురువారం(నేడు) నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి.
* మొదటిరోజు సుప్రభాత సేవ, భగవతారాధన, ఆరాధన, అధ్యయనోత్సవం, సేవాకాలము ఆరంభం
* ఏప్రిల్ 4న సుప్రభాతం, భగవతారాధన, ప్రధానంద పారాయణం, పరమపదోత్సవం, అర్థగోష్టి, వాసుదేవ పురాణ్యహవాచనం, అఖండ దీపారాధన, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకరార్పణం, నాంది ఇడహవాచనం, బ్రహ్మకలనస్మాపన, ఆరగింపు, అర్థ గోష్టి.
* ఏప్రిల్ 5న బాల భోగం, దేవతాహ్వానం, ద్వజారోహణం, అగ్ని ప్రరోష్ట హోమం, బలిహరణం, విష్ణు సహస్రనామ పారాయణం, నిళ్ల శ్రమము.
*ఏప్రిల్ 6న స్వామి వారి అభిషేకం, ఎదుర్కోలు అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్త అన్నారెడ్డి సుభాష్ రెడ్డి తెలిపారు. అదే రోజు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, నిత్చ హోమం.
* ఏప్రిల్ 7న భగవణగిన నిత్య హోమం, బలిహరణం, పొన్నంగి సేవ.
*ఏప్రిల్ 8న విష్ణుం సంస్ర వారు పారాయణం, బేరి పూజ, నిత్య హోమం, హనుమంత సేవ.
*ఏప్రిల్ 9న గరుడ సేవ, విష్ణు సంస్రనామ పారాయణం, నిత్చహోమం, బలిహరణం.
*ఏప్రిల్ 10న భగవతారాధన, రథహోమం, రథోత్సవం, అట్ల గోవు.
*ఏప్రిల్ 11న శ్రీ పుష్పయాగం, ఉద్యాసనములు, సప్త వర్ణ ఏకాంత సేవ, తదితర కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతీ ఏటా జరిగే స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఇందుప్రియాల్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
నేటి నుంచి 11వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఏప్రిల్ 6న జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు