Masjids | తొగుట : మైనార్టీల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి కలీమొద్దీన్ అన్నారు. ఇవాళ తొగుట మండల పరిధిలోని తుక్కాపూర్ మజీద్‌లో తుర్కకాశి సంఘం నాయకులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మజీద్‌కు గేటు, ఫ్యాన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పగానే.. ఆయన వెంటనే మజీద్‌కు గేటు 4 ఫ్యాన్లను అందజేస్తామన్నారు.
ఈ సందర్భంగా కలీమొద్దీన్ మాట్లాడుతూ.. మైనార్టీల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు. అనంతరం మైనార్టీ సంఘం నాయకులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమీర్, బాబా, మెద్దీన్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?