Mamitha Baiju | కోలీవుడ్ యంగ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటిస్తోన్ చిత్రాల్లో ఒకటి డ్యూడ్ (Dude). ఈ మూవీలో మమితాబైజు హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అక్టోబర్ 17న విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. ఈ సందర్భంగా మమితాబైజు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
కథలో ఉన్న కొత్తదనం వల్ల ఈ సినిమాకు ఒకే చెప్పానంది మమితా బైజు. కీర్తిశ్వరన్ చెప్పిన కాన్సెప్ట్ చాలా ఎక్జయిటింగ్‌గా, కొత్తగా అనిపించింది. నా పాత్ర కునాల్ కథలో చాలా కీలకంగా ఉంటుంది. నేను ఇదివరకెన్నడూ చేయని విధంగా ఉంటుంది. నా పాత్ర చాలా చాలెంజింగ్‌గా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు భావోద్వేగపూరితంగా ఉంటాయి. ఆ సన్నివేశాల కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. కానీ సెట్లో మాత్రం పూర్తిగా పర్ఫార్మెన్స్ పైనే ఫోకస్ పెట్టా. నా మీద ఎలాంటి ఒత్తిడి పడలేదు. నేను ప్రతీ సారి పూర్తిగా ప్రిపేరై వెళ్లేది. ఇది నాకు చాలెంజింగ్‌గా, రివార్డులా అనిపించిందని చెప్పుకొచ్చింది.
ఇక కోస్టార్ ప్రదీప్ రంగనాథన్ గురించి మాట్లాడుతూ.. సెట్లో ప్రదీప్‌తో ఉన్నపుడు ఫన్‌గా ఉండేది.. తేలికగా అనిపించేది.. చాలా సహజసిద్దమైన ఎనర్జీతో ప్రతీ సీన్‌ను పండించేలా చేసేవాడు. ఒక అర్థవంతమైన కోర్ పాయింట్‌తోపాటు ఫన్‌గా సాగుతుంది. డ్యూడ్ సినిమా కథ అన్ని రకాల వయస్సుల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని చెప్పుకొచ్చింది.
Read Also :
OG | థియేటర్లలో ‘ఓజీ’ ఘన విజయం ..ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై స్పెషల్ ఫోకస్..!
Ed Sheeran | ఇంటర్నేషనల్ కోలాబరేషన్.. బ్రిటీష్ పాప్ సింగర్‌తో సంతోష్ నారాయణన్ ఇండియన్ ఆల్బమ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.