Husnabad Police | హుస్నాబాద్ రూరల్, మే 20: హుస్నాబాద్ పోలీసులు ఇవాళ హుస్నాబాద్ మండలంలోని పోతారం(ఎస్) గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలపై కూలీలకు హుస్నాబాద్ పోలీసులు అవగాహన కల్పించారు.
వాట్సప్‌లో అపరిచితులు పంపే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని, బ్యాంకు అధికారులమంటూ ఎవరైనా కాల్ చేసి మీ ఖాతా వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదన్నారు. మహిళల పట్ల ఎవరైనా వేధింపులకు పాల్పడితే 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
మహిళా రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక రక్షణ చర్యల గురించి పోలీసులు ఉపాధి కూలీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో షీటీమ్ బృందం సభ్యులు సదయ్య, ప్రశాంతి, స్వప్న, కృష్ణ తదితరులు ఉన్నారు.
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ