Oil palm plants | కొమురవెల్లి, ఏప్రిల్ 16 : వేసవి నేపథ్యంలో ఆయిల్‌పామ్ మొక్కలకు నీళ్లు ఎక్కువగా ఇవ్వాలని డాక్టర్ పొన్ను స్వామి అన్నారు. దేశవ్యాప్తంగా నూనె గింజల ఆయిల్‌పామ్ తోటలను పర్యవేక్షించడంలో భాగంగా ఇవాళ మండలంలోని గురువన్నపేటలో రావుల శ్రావణ్‌కుమార్‌రెడ్డికి సంబంధించిన ఆయిల్ఫామ్ తోటలను సందర్శించారు.
అంతర పంటలుగా వేసిన అరటి, మునగ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా అంతరపంటలతో లాభాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ అదనపు డైరెక్టర్ సరోజనిదేవి, జిల్లా ఉద్యానశాఖ అధికారిణి సువర్ణ, ఆయిల్‌ఫెడ్ జిల్లా ఇన్చార్జ్ భాస్కర్, మండల ఉద్యాన అధికారిణి కౌసల్య, ఆయిల్‌పామ్ ఫీల్డ్ ఆసీసర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్