గిరిక తాటిచెట్లతో గీత కార్మికులకు ప్రయోజనం : మంత్రి హరీష్ రావు
మంత్రి హరీష్ రావు | గిరిక తాటిచెట్లతో గీత కార్మికులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

సిద్దిపేట : గిరిక తాటిచెట్లతో గీత కార్మికులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం సమీపంలోని తేజోవనంలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో గౌడ కులస్తులకు ఆయన గిరిక తాటి మొక్కలను పంపిణీ చేసి మాట్లాడారు. గిరిక తాటిచెట్లు ప్రయోజనాలు తెలిసే రెండేళ్లలో గీత కార్మికులకు 4 వేల మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు. సంప్రదాయ తాటిచెట్ల నుంచి కల్లు రావాలంటే 10 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. గిరిక తాటి నుంచి 5ఏండ్లలోనే కల్లు వస్తుందన్నారు. సాధారణ తాటిచెట్లు రోజుకు 5 నుంచి 10 సీసాల కల్లునిస్తే, గిరిక తాటి 40 నుంచి 100 సీసాలు వస్తుందన్నారు. వర్షాకాలం మినహా ఏడాదిలో 8 నెలలు కల్లు తీయవచ్చని తెలిపారు.
ఒక్కటి 10 సంప్రదాయ తాటిచెట్లకు సమానం
చక్కెర వ్యాధిగ్రస్తులు కూడా గిరిక తాటి కల్లు సేవించవచ్చు. వీటి ఎత్తు కూడా గరిష్ఠంగా 7 మీటర్ల వరకే ఉంటుంది. ఒక్క గిరిక తాటిచెట్టు 10 సంప్రదాయ తాటిచెట్లకు సమానమని మంత్రి స్పష్టం చేశారు. గీత కార్మికులకు ప్రయోజనకరంగా కలిగించేలా ఉన్నందునే ప్రభుత్వం మొక్కలను కొని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అంకుషాపురం, గుర్రాల గొంది, చిన్న గుండవెల్లి మినహా మిగతా గ్రామాల్లో మొక్కల సంరక్షణ ఆశించిన మేర లేదన్నారు. ఇకపై మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించే వారికే తిరిగి మరిన్ని అందిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే గజ్వేల్, దుబ్బాక , హుస్నాబాద్ నియోజవర్గాల్లోనీ గీత కార్మికులకు మొక్కలను పంపిణీ చేస్తా మన్నారు. క్షేత్ర స్థాయిలో మొక్కల సంరక్షణ తీరును పర్యవేక్షించేoదుకు 4 గ్రామాలకు ఓ ఆబ్కారీ కానిస్టేబుల్‌ను నియమించాలని అధికారులను ఆదేశించారు.
సంక్షేమానికి అనేక పథకాలు..
గీత కార్మిలకు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకoగా పెట్టిన మాదిరి సిద్దిపేటలోనూ నీరా సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. గౌడ కులస్తుల కోసం చేపట్టిన ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించి 5 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, కలెక్టర్ పీ వెంకట్రామిరెడ్డి, ఆర్డీఓ అనంత రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఎక్సైజ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గౌడ కమ్యూనిటీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 30న టీఆర్ఎస్లో చేరుతున్నా: ఇనుగాల పెద్దిరెడ్డి
పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తా : ఎమ్మేల్యే భూపాల్ రెడ్డి
దేశానికే దిక్సూచి తెలంగాణ వ్యవసాయ విధానాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

