రాయపోల్, ఏప్రిల్ 04 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆట వస్తువుల కొరత ఉందని తెలిసి ఓ ఎన్ఆర్ఐ ఉదారత చాటుకున్నారు. కేజీబీవీలో ఆట వస్తువులు లేవని రాయపోల్ ఎస్సై రఘుపతికి ప్రిన్సిపల్ తెలియజేశారు. ఎస్సై ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆయన స్నేహితురాలు సీహెచ్ ప్రశాంతి రెడ్డి (అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్) వెంటనే రూ.10వేల విలువైన ఆటవస్తువులను పంపించారు. వాటిని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి ఇవాళ విద్యార్థినులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల కోసం ఆటవస్తువులను పంపించిన ప్రశాంతి రెడ్డిని ఏసీపీ అభినందించారు.
చదువుతో పాటు ఆటల్లో కూడా పాల్గొంటూ విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలని ఏసీపీ పురుషోత్తం రెడ్డి సూచించారు. విద్య నేర్చుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. పిల్లలకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మహిళలు, బాలికల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. మంచిగా చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు.
students mu