మద్దూరు (ధూళిమిట్ట), సెప్టెంబర్11: మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘ఫ్రెషర్ డే’ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ద్వితీయ సంవత్సం విద్యార్థులు ప్రథమ సంవత్సర విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గ్రామ సర్పం-దామెర మల్లేశం మాట్లాడుతూ తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకొని, లక్ష్య సాధన కోసం ప్రణాళిక బద్దంగా కష్టపడి చదవాలన్నారు.
కళాశాలా చదివే విద్యార్థులకు ఎంసెట్ ఎంట్రెన్స్ పరీక్షకు తానే ఖర్చులు భరిస్తానని హామీనిచ్చారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు త ఆటపాటలతో సందడి చేశారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంచిగా చదివి తల్లిదండ్రులు, అధ్యాపకులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకరావాలన్నారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం సర్వర్, అధ్యాపకులు పాల్గొన్నారు.

