బుధవారం తెల్లవారుజామున నుంచి ఉదయం 9.30 వరకు పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పొగమంచు కారణంగా రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని తమ వాహనాలను నడిపారు. ఉదయం 9 గంటలు కావొస్తున్నా భానుడు కనబడలేదు. పొగమంచుతో రోడ్డు సరిగా కనిపించకపోవడంతో కొంతమంది వాహనాలను రోడ్డు పక్కకు నిలిపివేశారు. పంటపొలాల్లో పొగమంచు కమ్మేయడంతో తెల్లటి మంచు దుప్పటి కప్పేసినట్లు తలపించింది.