సిద్దిపేట: ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీల ఏర్పాటు చేయరాదని, ఇక నుంచి సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం నుంచి తప్పనిసరి అనుమతి తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారి అన్నారు. సోమవారం పట్టణంలోని ఫ్లెక్స్ ప్రింటింగ్ యజమానులతో మున్సిపల్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ అనుమతులు లేనిదే ఫ్లెక్స్ ప్రింటింగ్ దుకాణదారులు ప్రింటింగ్ చేయరాదని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి నస్రీన్భాను, ఫ్లెక్స్ ప్రింటింగ్ యజమానులు పాల్గొన్నారు.