రాయపోల్ జనవరి 16 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన సంగం నవీన్ తల్లి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకోని మిల్క్ సెంటర్ చైర్మన్ సత్తుగారి యాదవ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందిన బాధాకరమన్నారు.
కడు పేదరికంతో జీవించి ఖరీదైన వైద్యం చేయించుకోలేక మృతి చెందడం ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతావాదులు స్పందించి బాధిత కుటుంబానికి ఎవరికి తోచిన విధంగా వారు సహాయం అందించాలని పిలుపునిచ్చారు.