Accident | తొగుట, జనవరి 17: పండుగకు వచ్చి తండ్రి కుమారులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన చల్మెడ కుమార చారి (39) గ్రామంలో కుల వృత్తి లేకపోవడంతో గత కొన్నేళ్ల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్లోని ఘట్కేసర్కు కుటుంబ సభ్యులతో కలిసి వలస వెళ్లాడు.
సంక్రాంతి పండుగను తన సొంత గ్రామంలో జరుపుకోవడానికి ధర్మారం గ్రామానికి ఈ నెల 13వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. పండుగ ముగియడంతో బైకుపై తన కుమారుడు సుశాంత్ (7), కోడలు రమ్య శ్రీతో కలిసి శనివారం హైదరాబాద్కు బయలు దేరాడు. ఇదే క్రమంలో తొగుట మండలం జప్తి లింగారెడ్డి పల్లి ఎక్స్ రోడ్డు వద్ద లారీ, బైక్ ఢీ కొనడంతో సుశాంత్ అక్కడికి అక్కడే మృతి చెందాడు.
తీవ్ర గాయాలైన కుమార చారి ని చికిత్స నిమిత్తం సిద్దిపేటకు తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యలోనే మృతి చెందాడు. కుమార చారి కోడలు రమ్య శ్రీ కి తీవ్రమైన గాయాలై కాలు విరిగింది. దీంతో ధర్మారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కుమారస్వామి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
Konaseema | కోనసీమలో రికార్డింగ్ డ్యాన్స్ కలకలం.. డాన్సర్లను బట్టలు విప్పమన్న జనసేన నేత!