రాయపోల్ ఎప్రిల్ 30 : రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని పంట నమోదు వివరాలను స్వరూప రాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పంట నమోదు చేసుకుంటేనే పంట అమ్ముకోవడానికి వీలు ఉంటదన్నారు. కావున ప్రతి రైతు ప్రతి సీజన్ లో పంట నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. అదే విధంగా ప్రస్తుతం ఫెర్టిలైజర్ యాప్ అప్డేట్స్ కోసం రైతులకు బుకింగ్ ను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు పేర్కొన్నారు.
రైతులకు ఎవరికి అయిన యూరియా అవసరం ఉంటే నానో యూరియా వాడాలి అని, ఆయిల్ పామ్ పంట కోసం అమ్మోనియా సల్ఫేట్ వాడాలి అని సూచించారు. అదే విధంగా ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పక చేసుకోవాలి. అని ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా నే కేంద్ర ప్రభుత్వ పతకాల ప్రయోజనాలు రైతులు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారి స్వర్ణలత, రైతులు పాల్గొన్నారు.