Inspiration | తొగుట, సెప్టెంబర్ 2 : భారీ వర్షాలు కురుస్తున్నా, చెరువు పొంగి పొర్లుతున్నా విద్యుత్ సమస్య ఏర్పడితే ధైర్యంగా వెళ్లి విద్యుత్ సమస్యను పరిష్కరించిన విద్యుత్ కార్మికుడు మల్లేశం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల వనంచెరువులో విద్యుత్ స్తంభం ఇన్సూలేటర్ సమస్య ఏర్పడగా మల్లేశం మత్స్య కార్మికుడు బిక్షపతి సహాయంతో ధైర్యంగా తెప్ప మీద వెళ్లి ఇన్సూలేటర్ వేసి విద్యుత్ పునరుద్దరణ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా మల్లేశంను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పులిగారి శివయ్య, నాయకులు బండారు స్వామి గౌడ్, పిట్ల వెంకటయ్య, పాత్కుల స్వామి, నరేందర్, జహంగీర్, సుతారి రాంబాబు, రవి, ఎల్లం, స్వామి, యాదయ్య, బిక్షపతి తదితరులు ఉన్నారు.
రోడ్డుకు పునరుద్దరణ ..
ఇటీవల వర్షాల మూలంగా వెంకట్రావుపేటలోని వాగుగడ్డ వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో బస్సు, డీసీఎం, లారీల రవాణా నిలిచిపోయింది. బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో చందాపూర్ విద్యార్థులతోపాటు ప్రయాణికులకు ఇబ్బంది ఎదురైంది.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి జేసీబీతో రోడ్డును సరిచేయడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో నాయకులు బండారు స్వామి గౌడ్, జగన్, బిక్షపతి, మక్కల స్వామి, సుతారి రాంబాబు, వీరారెడ్డిపల్లి శేఖర్, సురేష్, మహేష్, యాదగిరి తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..
తొగుట : బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. తొగుట మండలంలోని వెంకట్రావు పేటకు చెందిన కళ్లెపు నర్సవ్వ (90) మరణించడంతో ఆమె పార్థీవదేహానికి నివాళి అర్పించారు. వారి కుటుంబీకులను పరామర్శించి తనవంతుగా రూ. 3000 ఆర్ధిక సహాయం అందించారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు బండారు స్వామి గౌడ్, పిట్ల వెంకటేష్, సుతారి రాంబాబు, జహంగీర్, నాగరాజు, కిష్టయ్య, కుమార్, మహేందర్, రాజు తదితరులు ఉన్నారు.
BRS leaders | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం : బీఆర్ఎస్ నాయకులు
Heavy rains | తిమ్మాపూర్ మండలంలో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం
Uttarakhand | ఉత్తరాఖండ్‌కు రెడ్ అలర్ట్.. 10 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత