సిద్దిపేట, ఆగస్టు 22 : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకోవాలని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డివైఎఫ్ఐ) సిద్దిపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డమైన అరవింద్, దాసరి ప్రశాంత్‌లు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేటలోని కార్మిక కర్షక భవనంలో వారు మాట్లాడుతూ.. జిల్లాలో దవాఖానల్లో విచ్చలవిడి టెస్ట్‌లు, అవసరానికి మించి మందులు, అనవసరమైన ఆపరేషన్లు చేసి సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారని ఆరోపించారు.
ఈ విషయంలో వైద్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారని విమర్శించారు. దవాఖానల్లో వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోతున్న పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి పార్కింగ్ స్థలం లేకుండా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యలేషన్ అయితే ఫైర్ ఇంజిన్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఉన్నాయని వందల కోట్ల వ్యాపారం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు స్వర్గం శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు గుండె పవన్ కళ్యాణ్, నరేశ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.