కొండాపూర్‌లో ఎండుతున్న పొలాలు
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్‌కు చెందిన బాకి మొగిలి అనే రైతు తనకున్న ఓ బోరు బావి సహాయంతో ఎకరం పొలంలో వరిని సాగు చేశాడు. ఎకరం పొలం దాదాపుగా ఎండిపోయింది. వడ్లూరి కనకాచారి అనే రైతు రెండెకరాల పొలంలో వరి వేశాడు.
- అడుగంటుతున్న భూగర్భ జలాలు
- పశువులపాలవుతున్న పచ్చని పంటలు
మద్దూరు(ధూళిమిట్ట), మార్చి 11: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్‌కు చెందిన బాకి మొగిలి అనే రైతు తనకున్న ఓ బోరు బావి సహాయంతో ఎకరం పొలంలో వరిని సాగు చేశాడు. ఎకరం పొలం దాదాపుగా ఎండిపోయింది. వడ్లూరి కనకాచారి అనే రైతు రెండెకరాల పొలంలో వరి వేశాడు. బావి నీళ్ల సహాయంతో పొలాన్ని పారిస్తున్నారు. దీంతో పదిగుంటల పొలం ఎండిపోయింది. ఇటీవల కాలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు, బావుల నీటిమట్టం తగ్గిపోయింది. దీనికితోడు తరుచుగా కరెంట్ ట్రిప్ అవుతుండడంతో నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి. నెర్రెలిచ్చిన పొలాలను తడిపేందుకు రైతులు నానా తంటాలు పడిన ఫలితం లేకపోతున్నది. దీంతో చేసేదేమి లేక రైతులు వరి చేనులో పశువులు, జీవాలను మేపుతున్నారు.
పచ్చని పంటలు ఎండిపోయి పశువుల పాలవుతుండడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పంటలు ఎండిపోతే కుటుంబాలను ఎలా పోషించుకునేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో చెరువు, కుంటల నిండా నీళ్లు ఉండడంతో బోరుబావుల్లో నీళ్లుండేవని, ప్రస్తుతం చెరువు, కుంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేండ్లుగా కరువు అనేది లేదని, మళ్లీ పాత రోజులు దాపరిస్తున్నాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే చెరువు, కుంటలను నింపాలని, ఎండిన పంటలకు నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

