తొగుట, మే 02 : ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో జయదేవ్ ఆర్య అన్నారు. మండలంలోని బండారుపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు రైతుల నుండి దాదాపుగా 2వేల ఆరువందల క్వింటాళ్ల ధాన్యం సేకరించామన్నారు. పేర్కొన్నారు. ఇందులో భాగంగా దాదాపుగా 1300 క్వింటాళ్ల ధాన్యానికి రైతుల ఖాతాలలో నగదు జమ శామన్నారు. ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించి రైతులు ఎవరు తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.