తొగుట మే 8 : రైతులు వ్యవసాయ భూముల్లో రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడడంతో భూసారం పెరిగి పంటలు అధిక దిగుబడి వస్తుందని డాక్టర్ ఎస్ శ్రీదేవి అన్నారు. బుధవారం తొగుట మండలంలోని గుడికందుల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువుల వాడకం నేల సంరక్షణ చర్యలను రైతులు తీసుకోవాలని సూచించారు. పంటల మార్పిడి వల్ల పంటలకు తెగుళ్లు రాకుండా ఉంటాయని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రమాదేవి, ఉమారాణి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.