DPO Janaki Devi | రాయపోల్, ఆగస్టు 17 : ముబారస్ పూర్ గ్రామంలో ఈగల వ్యాప్తితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీపీఓ దేవకీదేవి అన్నారు. దౌల్తాబాద్ మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం మా గ్రామంలో ఈగలు అధికంగా ఉన్నాయని సమస్యను పరిష్కరించాలని ఫోన్ ద్వారా డీపీఓకు ఫిర్యాదు చేశాడు. డీపీఓ దేవకీదేవి ఆదివారం డీఎంహెచ్ఓ ధనరాజ్, జిల్లా పశువైద్యాధికారి పూర్ణచంద్రరావుతో కలిసి డీపీఓ గ్రామాన్ని సందర్శించి వీధులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి దగ్గరలోనే పౌల్ట్రీ ఫారంలు ఉండడంతోనే ఈగలు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. కోళ్ల ఫారం యజమానులు ఫారంలో చనిపోయిన కోళ్లను విచ్చలవిడిగా బయటపడేయడంతో ఆ వ్యర్ధాల వల్ల ఈగలు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. కోళ్ల ఫారాలలో చనిపోయిన కోళ్లను బయటపడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, నోటీసులు జారీ చేయాలని ఇంచార్జ్ ఎంపీడీవో సయ్యద్ గఫూర్ ఖాద్రి, పంచాయతీ కార్యదర్శి సునీతలకు సూచించారు.
కోళ్ల ఫారం యజమానులు చనిపోయిన కోళ్లను బయటపడేయకుండా గుంత తీసి పూడ్చిపెట్టాలని సూచించారు. గ్రామంలో ఈగల మందుకయ్యే ఖర్చులు యజమానులే భరించాలని తెలిపారు. వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని ప్రజలకు తెలిపారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వీధుల్లో ఈగలమందు, ఫాగింగ్ పిచికారి చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పిఓ మల్లికార్జున రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ రేవతి,ఇంచార్జ్ మండల పశు వైద్యాధికారి శ్రావణ్ కుమార్, మండల వైద్యాధికారి నాగరాజు, డిప్యూటీ తహసిల్దార్ జహీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
Read Also :
YS Jagan | జగన్ భార్య వైఎస్ భారతి కూడా బస్సులో ఫ్రీగా వెళ్లొచ్చు.. పీతల సుజాత సెటైర్లు
Heavy Rains | భారీ వర్షం.. గాదిగూడ మండలం రోడ్డు అస్తవ్యస్తం
Pocharam project | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు