Badi Bata Programme | చేర్యాల, ఏప్రిల్ 26 : మండలంలోని కడవేర్గు గ్రామంలో ఇవాళ డీఈవో శ్రీనివాస్‌రెడ్డి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శబాష్‌గూడెం, నాగపురి, పెదరాజుపేట, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో డీఈవో బడిబాట ర్యాలీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఈవో ఆయా గ్రామాల్లో యువకులు, గ్రామస్తులతోపాటు ప్రైవేటు బడికి వెళ్తున్న విద్యార్ధుల ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం కడవేర్గు బడిబాటలో భాగంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విధ్య లభిస్తుందని, ఉన్నత విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఉచిత సౌకర్యాలతోపాటు టెక్నాలజీతో బోధన చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్ధలకు వెళ్లి తల్లిదండ్రులు కష్టపడి సంపాందించిన డబ్బులను వృధా చేయవద్దన్నారు. విద్యార్ధులకు దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనాన్ని సర్కారు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో ఎంఈవో ఆర్.కిష్టయ్య, కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రశేఖర్‌రావు,హెచ్ఎంలు ఎలికట్టె అయిలయ్య, మరాఠి సంతోష్, మల్లికార్జున్‌రెడ్డి, కిషన్, రాజు, ఉపాధ్యాయులు బాలభాస్కర్, రామచంద్రమూర్తి, విజయ్, డి.అయిల్‌రెడ్డి, కర్రోల్ల విజయ్‌కుమార్, ఆర్.సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్‌పేటలో ముందే మురిసిన గులాబీ జెండా