రాయపోల్ డిసెంబర్ 19 : సిద్దిపేట జిల్లా రాయపోల్ ఉప సర్పంచ్ గా ఎన్నికైన కుమ్మరి హనుమంతు రాజును కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ గా ఎన్నికైన రాజు మాట్లాడుతూ.. రాయపోల్ను అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. చిన్న వయసులో తనకు ఉప సర్పంచ్ బాధ్యతలు అప్పగించారని, పదవి రావడంతో మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. కుమ్మరి శాలివాహన సంఘ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. పదవులు ఎప్పుడు శాశ్వతం కాదని, పదవిలో ఉన్నప్పుడు మంచి పనులు చేసి గుర్తింపు తెచ్చుకోవలని ఉందన్నారు. తనపై నమ్మకం నుంచి గ్రామ ఉపసర్పంచిగా బాధ్యతలను అప్పగించిన గ్రామ సర్పంచ్, మెంబర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కుమ్మరి మంజుల, తిమ్మకపల్లి ఉపసర్పంచ్ కుమ్మరి ప్రవీణ్, లింగారెడ్డిపల్లి వార్డ్ మెంబర్ కుమ్మరి మహిపాల్, మండల అధ్యక్షులు బొందుగుల షాదుల్, యూత్ అధ్యక్షులు హనుమంతు రాజు, జిల్లా నాయకులు యాదగిరి,స్వామి ,మండల ప్రధాన కార్యదర్శి రామారం స్వామి ,ఉపాధ్యక్షులు స్వామి,యూత్ ఉపాధ్యక్షులు నాగరాజు,కుమార్ ,మండల కార్యవర్గ సభ్యులు కనకయ్య, మహేష్, కనుకయ్య, ప్రవీణ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.