రాయపోల్,జనవరి 04 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామంలో వీధి కుక్కల దాడిలో రెండు జింకలు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన బాల్రెడ్డి ఆదివారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లగా అక్కడ రెండు జింకలు మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు.
ఈ విషయాన్ని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన జింకలపై పంచనామా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఫరాగ్ హైమద్, సెక్షన్ ఆఫీసర్ హైమద్ హుస్సేన్, బీట్ ఆఫీసర్లు వేణు, జాంగిర్ తదితరులు పాల్గొన్నారు.