ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30న సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేయడంతోపాటు గులాబీ పార్టీకే తమ ఓటు అంటూ నినదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఆర్థిక. వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు సుడిగాలి పర్యటనలు చేస్తూ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి పక్షాలను డైలమాలో పడేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు.
సిద్దిపేట, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ ‘ప్రజాఆశీర్వాద’ సభలతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మంచి జోష్‌లో ఉన్నది. హుస్నాబాద్, సిద్దిపేటలో నిర్వహించిన సభలు సూపర్ సక్సెస్ కావడంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముందుకు కదులుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సిద్దిపేట జిల్లాలో రెండు సభలను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. తొలి సభను హుస్నాబాద్‌లో నిర్వహించగా, రెండో సభను సిద్దిపేట పట్టణంలో మంగళవారం నిర్వహించింది.
మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో నిర్వహించిన సభకు సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేశారు. సిద్దిపేట ప్రగతి ప్రజాఆశీర్వాద సభను లక్ష మందితో నిర్వహించాలనకున్న సభ అంతకు పైగా జనం తరలి రావడంతో గ్రౌండ్ సరిపో లేదు.. రోడ్లు కిక్కిరిసి పోయా యి.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. సభను చూసిన వారికి ఇండ్లలో ఎవరన్నా..? ఉన్నారా..? అని అనిపించింది. నియోజకవర్గం అంతా ఇక్కడే ఉంది అన్నట్లుగా ప్రజలు సభకు వచ్చి విజయవంతం చేశారు.
ప్రగతి ఆశీర్వాద సభ అద్యాంతం ప్రజల హర్షధ్వానా లు.. నినాదాల మధ్య సాగింది. యువకులు, మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. గ్రామాలకు గ్రామాలే సభకు తరలివచ్చాయి. ప్రజలు స్వచ్ఛందంగా ఆటో,బస్సు, సైకిల్ మోటరు ఏది దొరికితే దాన్ని పట్టుకొని సీఎం సభకు వచ్చారు. సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకోగానే యువకులు, మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విజిళ్లు, చప్పట్లు, జై కేసీఆర్.. జై హరీశ్ రావు.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. సిద్దిపేటలో నియోజకవర్గ సభకు భారీ స్థాయిలో జనం తరలిరావడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యర్తం చేస్తున్నాయి. హుస్నాబాద్ సభకు సైతం అన్ని గ్రామాలు, తండాల నుంచి జనం తరలిరావడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్ కుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు పని చేస్తున్నాయి. కాగా రెండు చోట్ల నిర్వహించిన సభలకు మహిళలు, యువత, విద్యార్థి విభాగం నాయకులతో పాటు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మద్దతు తెలియ జేశారు. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించినప్పడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నిత్యం ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చినప్పుడు ప్రజల నుంచి జై కేసీఆర్, జై జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫేస్టోకు ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి తమ ఓటు అంటూ నినాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లా ల్లో మంత్రి తన్నీరు హరీశ్‌రావు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో ప్రతి పక్ష పార్టీలను డైలమాలో పడేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యర్తలు జోష్‌లో ఉన్నారు.
సీఎం కేసీఆర్ సభలతో జోష్
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పార్టీ సభలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈనెల 15న హుస్నాబాద్, 17న సిద్దిపేటలో ‘ప్రజాఆశీర్వాద’ సభలు పూర్తి కాగా, ఈనెల 30న సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో సీఎం కేసీఆర్ సభ ఉన్నది. వచ్చే నెల మొదటి వారంలో మరికొన్ని సభలను నిర్వహించేలా పార్టీ కార్య చరణ సిద్దం చేస్తుంది. వచ్చే నెల 9న సీఎం కేసీఆర్ నంగునూరు మండంల కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన నామినేషన్ పత్రాలను అక్కడే పెట్టి పూజలు చేసిన అనంతరం నేరుగా గజ్వేల్‌కు వెళ్లి గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేస్తారు. అక్కడి నుంచి నేరుగా కామారెడ్డికి వెళ్లి అక్కడ తన నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంత్రి హరీశ్‌రావు సుడిగాలి పర్యటనలను చేస్తున్నారు. ఎక్కడి కక్కడ పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేస్తూనే అయా నియోజకవర్గ కేంద్రాల్లో సీఎం కేసీఆర్ సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూకుడు..
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూకుడును పెంచింది. పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు వారికి పార్టీ బీఫాంలను అందజేయడంలోనూ ముందు న్న బీఆర్ఎస్ పార్టీ జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న (హుస్నాబాద్‌తో కలుపుకొని ) 11 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్జెండాను ఎగుర వేయడమే లక్ష్యంగా గులాబీ దండు ముందుకుపోతున్నది. ఇతర పార్టీలకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా పక్కాగా ప్రణాళికతో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది.
గజ్వేల్ సీఎం కేసీఆర్‌కు భారీ మెజార్టీ తీసుకువచ్చేలా అక్కడి పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో అన్ని వర్గాలను కలుస్తూ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలనే వివరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ కన్నా అత్యధికంగా మెజార్టీని ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్తూ ప్రజలను కలుస్తూ, దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధ్దిని వివరిస్తూ గెలిపించాలని కోరుతున్నారు. త్వరలోనే దుబ్బాక నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ రానున్నట్లు వారు చెబుతున్నారు.
ఇక మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి, ఆందోల్ నియోజకవర్గంలో చంటి క్రాంతి కిరణ్,నారాయణ్‌ఖేడ్ భూపాల్‌రెడ్డి, జహీరాబాద్ మాణిక్యరావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిలతో పాటు హుస్నాబాద్‌లో వొడితెల సతీశ్‌కుమార్, జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తమ ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. తమ తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రజల ముందు చర్చ పెడుతున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకుపోతున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని పార్టీలోకి చేర్చుకుంటూ మరింతగా పార్టీని పటిష్టం చేస్తున్నారు.
21న వ్యాసరచన పోటీలు
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 18 : విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులను స్మరించుకుంటూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత బుధవారం ఒకప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొదటి విభాగం, ఇంటర్ నుంచి డిగ్రీ ఆపైన చదివే వారికి రెండో విభాగంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించనున్న వ్యాసరచన పోటీలో పాల్గొనాలని కోరారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మీరు రాసిన వ్యాసాన్ని సబ్మిట్ చేయాలన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన ఉత్తమ మూడు వ్యాసాలకు బహుమతులు అందజేయడంతో పాటు ఆ వ్యాసాలను సంబంధిత జిల్లా కమిషనరేట్ అధికారిక సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నారు. ఇతర జిల్లాలు, కమిషనరేట్ల స్థాయిలో బహుమతులు గెలుపొందిన వ్యాసాల నుంచి ఉత్తమ మూడు వ్యాసాలను రాష్ట్ర స్థాయి ఉత్తమ వ్యాసాలుగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారిక సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నారు.