– తొగుట సీఐ షేక్ లతీఫ్
రాయపోల్, జనవరి 30 : సీఎం కప్ క్రీడా పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహద పడుతాయని సిద్దిపేట జిల్లా తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారి ప్రతిభను చాటేలా విద్యార్థులు సీఎం కప్ క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి విద్యార్థులు మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, ఉప సర్పంచ్ కుమ్మరి రాజు, ఎంపీఓ శివకుమార్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రేకుల నరసింహారెడ్డి, జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు స్వామి, పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజు, పీఈటీ గోవర్ధన్ రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Rayapol : గ్రామీణ ప్రతిభ వెలుగుకు సీఎం కప్ క్రీడలు దోహదం