రాయపోల్ జనవరి 21 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో సీఎం కప్ క్రీడోత్సవాలు ఈనెల 22 నుంచి 24 వరకు నిర్వహిస్తామని ఎంపీడీవో శ్రీనివాస్. మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు వారి పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
సీఎం కప్ (CM CUP-2025) క్రీడోత్సవాలలో పాల్గొనుటకు ఆసక్తి గల క్రీడాకారులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నమోదు చేసుకోగలరు. క్లస్టర్ గ్రామాల వారీగా క్రీడాకారుల ఎంపిక తేదీ. 22.01.26 నుండి 24.01.26 వరకు ఉంటుంది.
1. రాయపోల్ (6) రాయపోల్, అనాజీపూర్, మంతూర్, తిమ్మక్కపల్లి, లింగారెడ్డిపల్లి, చిన్నమసాన్ పల్లి. 2. బేగంపేట్ (4) బేగంపేట్, యెల్కల్, వడ్డేపల్లి, వీరారెడ్డిపల్లి. 3. రామారం (4) రామారం, సయ్యద్ నగర్, గొల్లపల్లి, టెంకంపేట. 4. రాంసాగర్ (5) రాంసాగర్, ఆరెపల్లి (sj), కొత్తపల్లి, ముంగిసపల్లి, అంకిరెడ్డిపల్లి.
1. కబడ్డీ (ఓపెన్ టు ఆల్)
2. ఖోఖో (18 సం.లలోపు)
3. వాలీబాల్ (18 సం.లలోపు)
4. యోగా (18 సం.లలోపు)
క్లస్టర్ గ్రామపంచాయతీలో ఎంపికైన క్రీడాకారులు మండల స్థాయిలో పాల్గొనాల్సి ఉంటుంది. మండల స్థాయిలో క్రీడోత్సవాలు తేదీ 30.01.26 రోజున రాయపోల్‌లో జరుగుతాయి. కావున ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొని, సీఎం కప్‌ను విజయవంతం చేయాలని ఎంపీడీవో, విద్యాధికారి పేర్కొన్నారు.