Telangana newsమద్దూరు(ధూళిమిట్ట), మే01: విధి నిర్వహణలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం ద్వారానే ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని చేర్యాల సీఐ శ్రీను అన్నారు. గురువారం మద్దూరు పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐ నర్ర విజయ్‌కుమార్ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది మిగతా ఉద్యోగాల కంటే భిన్నమైనదని, ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్లు పోలీసులు మాత్రమేనన్నారు.
పోలీసులు నిబద్దతతో తమ విధులు నిర్వహించాలని సూచించారు. కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరినవాళ్లు తమ సీనియర్ల ద్వారా పనిని నేర్చుకోవాలన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన విజయ్‌కుమార్ దంపతులను పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మద్దూరు, చేర్యాల ఎస్ఐలు షేక్ మహబూబ్, నీరేశ్, ఏఎస్ఐ సదాశివరావు, హెడ్ కానిస్టేబుల్ నాగిరెడ్డి, కానిస్టేబుళ్లు, పాత్రికేయులు పాల్గొన్నారు.