రాయపోల్, డిసెంబర్ 21: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) శాఖ కొత్త భవనంలోకి మారనుంది. నూతన భవనాన్ని వరంగల్ రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్ నేడు ప్రారంభిస్తారని రాయపోల్ సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ సంజయ్ పాల్ తెలిపారు. ఖాతాదారులు ఆధునిక బ్యాంకింగ్ సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఆధునిక వసతులతో. ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రైవేట్ భవనంలోకి మార్చారు. లాకర్ సదుపాయం, గోల్డ్ లోన్, వివిధ రకాల రుణాలు అందించేందుకు అనువైన ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో భద్రతను పెంచి, విశాలమైన హాల్‌తో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించారు.
ఖాతాదారుల ఇబ్బందులకు ముగింపు నూతన భవనం ప్రారంభంతో గత కొన్నేళ్లుగా ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్యలు నేటితో తీరనున్నాయి. రాయపోల్తో పాటు పరిసర మండలాలు, గ్రామాల ప్రజలకు ఈ బ్యాంక్ మరింత ఉపయోగకరంగా మారనుంది.1980లో ఇరుకైన గదిలో ప్రారంభమైన ఈ బ్యాంక్, అప్పటి నుంచి పరిసర గ్రామాల ప్రజలకు విశ్వసనీయ సేవలు అందిస్తోంది. కాలక్రమేణా ఖాతాదారులు, లావాదేవీలు గణనీయంగా పెరగడంతో చిన్న భవనంలో సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. బ్యాంకు సేవలను మరింత విస్తరించాలన్న ప్రజల విజ్ఞప్తులను అధికారులు పరిగణనలోకి తీసుకుని నూతన భవనం ఏర్పాటు చేశారు.