రాయపోల్ సెప్టెంబర్ 10: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాయపోల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేసీఆర్ చావు కోరిన శాసన సభ్యుడు వీర్లపల్లి శంకర్‌పై బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ఇప్ప దయాకర్ నేతృత్వంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావు కోరుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై యువజనవిభాగం భగ్గుమంది. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం రాయపోల్ మండల కేంద్రంలో నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ఇప్ప దయాకర్ అధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహాన్నికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నాయకులు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. ఎస్సై మానసకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ఎన్నో ఉద్యమాలు చేసి, అని వర్గాల ప్రజలను ఏకం చేసి, ఢిల్లీ మెడల్ వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావు కోరడం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు తగదని హెచ్చరించారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శంకర్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హనుమంతు రాజు, మాజీ ఎంపీటీసీ మాదాసు రాజగౌడ్, మంతూర్ సర్పంచ్ పర్వేజ్ అహ్మద్, ఉప సర్పంచ్ బందరం సంతోష్, మండల బీఆర్ఎస్ నాయకులు మాదాసు నవీన్, మంజూర్, మహేష్, రాంపల్లి సతీష్, అశోక్, బాలకృష్ణ, కొంగరి శ్రీకాంత్, నాంసాని స్వామి, సందీప్, తదితరులు పాల్గొన్నారు.