BRS Strike | తొగుట, ఏప్రిల్ 30 : ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా నుండి మొదలుకొని కొనుగోలు వరకు రైతులను అరి గోస పోసుకుంటున్నారని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విమర్శించారు. తొగుట వ్యవసాయ మార్కెట్ లో గత 15రోజులుగా పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు చేయకపోవడం, మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగడంపై నిరసిస్తూ తొగుట మార్కెట్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాలు ధరించి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ లో రైతు డిక్లరేషన్ పేరిట అలివికాని హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు.. యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడ్డారని, యూరియా కావాలంటే యాప్ ఇచ్చారని విమర్శించారు. మండు టెండల్లో అష్టకష్టాలు పడి పంటలు పండిస్తే కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నరన్నారు. ప్రభుత్వానికి రైతు సమస్యలపై ముందు చూవు కొరవడిందని, నాడు కేసీఆర్ హయాంలో పంట కొనుగోలుకు ముందస్తు ప్రణాళిక ఉండేదన్నారు.
తొగుట మార్కెట్లో 4900 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు చేసినా ఒక్క పైసా కూడా రైతులకు రాలేదన్నారు. మార్కెట్లో గత 15 రోజులుగా 50 టన్నుల వరకు పొద్దు తిరుగుడు ధాన్యం పేరుకు పోయిందని, కేంద్ర ప్రభుత్వ టార్గెట్ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. వరి ధాన్యంను రాష్ట్రం మొత్తంలో బీ గ్రేడ్లో కొనుగోలు చేయడం అంటే రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు. మార్కెట్ కు ధాన్యం తీసుకువోస్తే గేట్ కు తాళం వేయడమే ప్రజా పాలననా అని మాజీ సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి ఏద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు గోస, యూరియా గోస, కొనుగోలు గోసలతో రైతులు విసిగి పోయారని వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోవడంతో ఎస్ఐ రవికాంత్ రావు ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనను విరమింపజేశారు. అనంతరం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు గంగసాని రాజిరెడ్డి,బక్క కనకయ్య, నాయకులు సిలివేరి మల్లారెడ్డి,వేల్పుల స్వామి, దోమల కొమురయ్య, సుతారి రమేష్, కుర్మ యాదగిరి, నరేందర్ గౌడ్,మాదాసు అరుణ్ కుమార్,రడం భాస్కర్ గౌడ్,ఎల్లం, మంగ నరసింహులు, అంజయ్య, భిక్కనూరు శ్రీశైలం,మంగ యాదగిరి, అనిల్ కుమార్, మాదారం ప్రశాంత్, బోయిని శ్రీనివాస్, భూపాల్ రెడ్డి, సుతారి రాంబాబు, బిక్కనూరి సంతోష్, జహంగీర్, పర్శరాములు, నాగయ్య, మల్లేశం తో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.

