రాయపోల్, జనవరి 16: రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, రైతు గౌస్ (33) విద్యుత్ షాక్తో మృతి చెందారు. పొలంలో గడ్డి కట్ చేస్తుండగా గౌస్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యారు. దాంతో, ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలంలో గౌస్ యంత్రంతో గడ్డి కట్ చేస్తుండగా.. విద్యుత్ పోల్ నుండి స్టాటర్ డబ్బాకు కరెంట్ వచ్చే తీగ తెగి యంత్రానికి తగిలింది. విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడ్డ గౌస్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గౌస్ అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గౌస్ మృతి పట్ల గ్రామస్థులు, పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.