రాయపోల్, డిసెంబర్ 12: తొలి విడత ఎన్నికల్లో రాయపోల్ (Rayapole) మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ (BRS) బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధులు భారీ మెజార్టీతో గెలుపొందారు. మండలంలోని మంతూర్ గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ మద్దతిచ్చిన పర్వేజ్ అహ్మద్ (Parvez Ahmed) 10 వార్డులను క్లీన్‌స్వీప్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధిపై 456 ఓట్ల మెజార్టీతో పర్వేజ్ గెలుపొందారు. బేగంపేటలో మద్ద గీతా ప్రవీణ్ కాంగ్రెస్ అభ్యర్థిపై 297 ఓట్ల తేడాతో సర్పంచ్‌గా విజయం సాధించారు.
చిన్నమాసాన్ పల్లిలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటి చేసిన రేకుల నర్సిహ్మ రెడ్డి (Rekula Narsimha Reddy) 272 ఓట్ల మెజార్టీతో జయభేరి మోగించారు. ఆనాజీపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సోమని నిర్మలా ఇస్తారి సర్పంచ్ పదవి కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 242 ఓట్ల మెజార్టీతో నిర్మలా ఇస్తారి గెలుపొందారు. మొత్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో రాయపోల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది.
పదేళ్ల కేసీఆర్ పాలనను గుర్తుపెట్టుకున్న ప్రజలు గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్ధులకు బ్రహ్మరథం పట్టారు. సర్పంచ్‌లుగా భారీ తేడాతో గెలుపొదడంతో గ్రామల్లో బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉందని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. త్వరలో జరుగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతున్నట్లు పలు గ్రామాల బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.