Rayapol | తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి : బాల లక్ష్మి
ఈ నెల 10న గ్రేట్ మిలియన్ మార్చ్ డేను తెలంగాణ ఉద్యమాకరుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యమ కళాకారుల జేఏసీ రాష్ట్ర నాయకురాలు బంగరెడ్డి బాల లక్ష్మి తెలిపారు.
రాయపోల్, మార్చి 09 : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిన మిలియన్ మార్చ్ ను స్మరించుకుంటూ ఈ నెల 10న గ్రేట్ మిలియన్ మార్చ్ డేను తెలంగాణ ఉద్యమాకరుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యమ కళాకారుల జేఏసీ రాష్ట్ర నాయకురాలు బంగరెడ్డి బాల లక్ష్మి తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో ఛలో గన్ పార్క్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమర వీరులను స్మరించుకోవడంతో పాటు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ సాధనలో భాగంగా జరిగిన మిలియన్ మార్చ్ ఉద్యమం రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు తిప్పిందని, ఆ ఉద్యమ స్ఫూర్తిని మరువకుండా తెలంగాణ అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మార్చి 10, 2026 న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద గ్రేట్ మిలియన్ మార్చ్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, టీయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బుచ్చమ్మ ,జేఏసీ నాయకులు పంబాల చిత్తార, లింగారెడ్డి , నాగమణి, అనసూయ, మల్లమ్మ ,యాదమ్మ , మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

