Agriculture Tools | రాయపోల్, జనవరి 22 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మహిళా రైతులందరూ వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నరేష్ సూచించారు.
గురువారం వ్యవసాయ అధికారి నరేష్ విలేకరులతో మాట్లాడుతూ.. వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా SMAM 2025-26 పథకం ద్వారా 50% రాయితీపై మహిళా రైతులకు మాత్రమే మహిళల పేరు మీదనే భూమి ఉండాలి. ట్రాక్టర్ RC- మహిళ పేరు మీద కానీ భర్త పేరు మీద కానీ ఉండాలన్నారు. ఈ క్రింది పనిముట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
1.బ్యాటరీ స్ప్రేయర్స్ – 94
2.పవర్ స్ప్రేయర్స్ -16
3.సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ల్ -01
4.కల్టీవేటర్-8
5. మొక్కజొన్న షెల్లర్-02
6. స్ట్రా బెలర్-01
7. రోటోవేటరు -02
జతపరచవలసిన పత్రాలు :
దరఖాస్తు పత్రము, భూమి పాసుబుక్ , ఆధార్ (ట్రాక్టర్ సంబంధిత పనిముట్లకు). ఆసక్తిగల మహిళా రైతులు తేదీ 25-01-2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఏవో నరేశ్ పేర్కొన్నారు.