చేర్యాల, మే 1 : పట్టణంలోని వివిధ వార్డులలో ఎలాంటి అనుమతి లేకుండా గృహాలు నిర్మాణం చేపడుతున్నారని, నిర్మాణదారుల వద్ద మున్సిపల్ అధికారులు లక్షలాది రుపాయాలు లంచాలు తీసుకుంటున్నారని వెంటనే సంబంధిత శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ అందె బీరన్న గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది సహాయంతో చేర్యాలలో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిర్మాణాలు ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికి కార్యాలయంలో ఉన్న నలుగురు కిందిస్థాయి అధికారులతో వసూలు చేయిస్తున్నాడని వెంటనే అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.