బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో గులాబీ పార్టీలో చేరారు. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో పలువురు బీజేపీకి గుడ్‌బై చెప్పారు. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామానికి చెందిన యువకులు, అక్బర్పేట-భూంపల్లి మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన పలువురు గులాబీపార్టీకి జైకొట్టారు. మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు.
రాయపోల్, అక్టోబర్ 18 : సీఎం కేసీఆర్ పాలనలో దుబ్బాక నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియాల్ గ్రామ ఉపసర్పంచ్ మల్లేశంతో పాటు సూర్యప్రకాశ్, అశోక్, హనుమంతు, కృష్ణ, రాజు బీజేపీకి రాజీనామా చేసి ఎంపీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని చూడాలని, అబద్ధాలను నమ్మి మోసపోతే గోసడుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో గ్రామాల్లోకి వస్తారని, వారి మాటలను నమ్మొద్దన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో బీఅర్ఎస్ జిల్లా మైనార్టీ సెల్ నాయకులు మహ్మద్ షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.
దుబ్బాకపై ఎగిరేది గులాబీ జెండానే..
మిరుదొడ్డి, అక్టోబర్ 18 : ఉద్యమాల పురిటి గడ్డ దుబ్బాకపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అల్వాల గ్రామం నుంచి వివిధ పార్టీలకు చెందిన సుమారు 50మంది యువకులు ఎంపీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. దుబ్బాక ప్రజలు చాలా విజ్ఞులని, ప్రతిపక్ష పార్టీలు చేసే జిమ్మిక్కులను నమ్మకుండా కారుగుర్తుకు ఓటు వేసి తనను దీవిస్తారని తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన యువకులకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు. కార్యక్రమంలో అల్వాల గ్రామ ఉపసర్పంచ్ దిలీప్‌రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గున్నమ్మగారి ప్రపాద్, బీఆర్ఎస్ యూత్ నాయకులు నిమ్మ నితిన్, నానం గణేశ్, ఎండీ సాదక్, తుడుం సాయిలు, ఎర్రోళ్ల నరేశ్, కిరణ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన రుద్రారం గ్రామ వివిధ పార్టీల నాయకులు
మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), అక్టోబర్ 18 : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయా పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం అక్బర్పేట-భూంపల్లి మండలంలోని రుద్రారం గ్రామంలోని ఆయా పార్టీలకు చెందిన మ్యాదరి నర్సింహులు, నరేందర్‌రెడ్డి, పడాల నిఖిల్‌తోపాటు పలువురు ఎంపీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలోని ప్రజలు సీఎం కేసీఆర్ వెంటనే ఉన్నారని తెలిపారు. 70 ఏండ్లు గత పాలకులు చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసి చూపించారని తెలిపారు. దుబ్బాక నియోజవర్గంలోని ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, బాణాల రాజు, ఏఎంసీ డైరెక్టర్ అభిలాశ్‌రావు, అరవింద్, బోయిని రామస్వామి, బక్కి పవన్, నేరండ్ల నవీన్, పడాల నిఖిల్ పాల్గొన్నారు.