తొగుట సెప్టెంబర్ 26 : భారీ వర్షాలు కురుస్తున్ నేపథ్యంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టును గజ్వేల్ ఎసిపి నరసింహులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ మల్లన్నసాగర్‌లోకి ఎవరు దిగొద్దన్నారు. గ్రామాలలో చెరువులు కుంటలు వాగులు, వంకలు నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రాజెక్టు లోపటికి దిగడానికి ఎవరికి కూడా అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా ప్రాజెక్టులోకి దిగి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో తొగుట సిఐ లతీఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.