సిద్దిపేట : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందులాపూర్ సమీపంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ను అబుదాబికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రతినిధుల బృందం శుక్రవారం పరిశీలించింది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సిద్దిపేటకు చేరుకున్న టీం మెంబర్స్ రిజర్వాయర్ టన్నెల్ లోపల ఉన్న మోటర్లను పరిశీలించారు.
ప్రాజెక్ట్ వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. ఈ బృందంలో హెచ్.ఈ. డాక్టర్ అబ్దుల్లా హుమైద్ సైఫ్ అల్ జర్వాన్ అల్ షమ్సి, హెచ్.ఈ. ఇంజి. అహ్మద్ మొహమ్మద్ అల్రుమైథి, డాక్టర్ అహ్మద్ అబ్దెల్మౌటి, మజీద్ బిన్ కువైట్, హమ్జా మెరౌనే బెనాబిడ్ తదితరులు ఉన్నారు.