నంగునూరు, ఏప్రిల్ 13 : నంగునూరు మండలం అప్పలాయచెరువు గ్రామంలో బుధవారం అభయాంజనేయస్వామి, విశ పంచాయతన నగగ్రహ, నాగదేవత ప్రతిష్ఠ మహోత్సవానికి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. నర్మెటలో రూ. 250 కోట్లతో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నామని, పది తరాలు నిలిచిపోయే పని ప్రారంభం చేసుకుంటున్న దరిమిలా ఆంజనేయస్వామిని దర్శించుకొని, దిగ్విజయం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గ్రామంలో పెద్దమ్మ ఆలయాన్ని గతేడాది ప్రారంభించుకున్నామని, అభయాంజనేయస్వామి ఆలయాలను నిర్మించుకున్నట్లు సంబురం వ్యక్తం చేశారు. దుర్గాదేవి ఆలయానికి కూడా సహకరిస్తానని పేర్కొంటూ.. గ్రామస్తులంతా ఇదే తరహాలో ఐక్యంగా కలిసి ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.