Siddhi vinayaka temples | జహీరాబాద్, మార్చి 16 : న్యాల్కల్ మండల పరిధిలోని రేజింతల్, హద్నూర్, చీకూర్తి గ్రామాల్లోని సిద్ధి, వర సిద్ధి వినాయక ఆలయాల్లో సోమవారం సంకష్ట హార చతుర్థి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాల్లో వేడుకల కోసం ఏర్పాట్టు పూర్తి చేసినట్టు స్థానిక ఆలయాల ట్రస్టు సభ్యులు, నిర్వాహకులు తెలిపారు.
ఈ సంకష్ట హార చతుర్థి వేడుకలకు మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల భక్తులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. భక్తులు ఆధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు