న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా భోజనం, ఇతర ఆహార పదార్థాల్ని తెప్పించుకునే ‘ఈ-ప్యాంట్రీ’ సేవల్ని ఐఆర్సీటీసీ ప్రారంభించింది. తొలుత ఈ సౌకర్యాన్ని 25 మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల కోసం తీసుకొచ్చినట్టు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు.
దీంతో రైల్వే ప్రయాణికులు ఆన్లైన్లో ఆహారాన్ని బుక్ చేసుకుంటే, వారి బెర్త్ వద్దకే ఆహారాన్ని అందజేస్తారు. రైళ్లలో ఆహారం, పానీయాలు నిల్వ చేసే లేదా సరఫరా చేసే చిన్న గదిని ‘ప్యాంట్రీ సర్వీస్’గా పేర్కొంటారు.