మారుతున్న పాన్ రూల్స్.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త ఐటీ నియమాలు
బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు/ఉపసంహరణలు, ఆస్తులు-మోటర్ వాహనాల కొనుగోళ్లు, హోటల్/రెస్టారెంట్ బిల్లుల చెల్లింపులు, ఇతరత్రా వాటిల్లో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) వివరాలకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలు మారబోతున్నాయి.
- రూ.5 లక్షల విలువ దాటితే అన్ని మోటర్ వాహన కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి
- లక్ష రూపాయలు మించితేనే హోటల్/రెస్టారెంట్ పేమెంట్స్‌కు వర్తింపు
- తాజా ఆదాయ పన్ను నిబంధనల ముసాయిదాలో మరిన్ని ప్రతిపాదనలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు/ఉపసంహరణలు, ఆస్తులు-మోటర్ వాహనాల కొనుగోళ్లు, హోటల్/రెస్టారెంట్ బిల్లుల చెల్లింపులు, ఇతరత్రా వాటిల్లో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) వివరాలకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలు మారబోతున్నాయి. తాజాగా విడుదలైన ఆదాయ పన్ను (ఐటీ) రూల్స్ ముసాయిదా 2026లో పాన్‌ను పేర్కొనేందుకున్న పరిమితుల్ని గణనీయంగా పెంచారు. ఈ ప్రతిపాదనలకు భాగస్వాములతో సంప్రదింపులు, అభిప్రాయాల సేకరణ తర్వాత పునఃపరిశీలించి, అవసరమైన మార్పులు చేసి మార్చి మొదటి వారానికల్లా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రూల్స్‌కు తుది రూపు ఇవ్వనున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
ఏప్రిల్ 1 నుంచి..
ఆదాయ పన్ను చట్టం 1962 స్థానంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. ఆదాయ పన్ను చట్టం 2025ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 1న మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి ఇది అమల్లోకి రానున్నది. పాత చట్టంతో పోల్చితే కొత్త చట్టంలో రూల్స్ సంఖ్యను 511 నుంచి 333కు, ఫామ్స్‌ను 399 నుంచి 190కి తగ్గించారు. ఇందులో భాగంగానే కొత్త ఐటీ రూల్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఇప్పుడు విడుదలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
- ఎవరికైనా చెందిన ఒకటి, అంతకంటే ఎక్కువ ఖాతాల్లో ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు, ఆపై మొత్తాల్లో నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలకు పాన్ వివరాలు తప్పనిసరి.
- ప్రస్తుతం ఒక్క రోజులో రూ.50,000 మించి బ్యాంకింగ్ సంస్థలోగానీ, సహకార బ్యాంక్‌లోగానీ నగదు డిపాజిట్‌కు పాన్ వివరాలు అవసరం అవుతున్నాయి.
- మోటర్ సైకిళ్లు సహా అన్ని వాహన కొనుగోళ్లలో ధర రూ.5 లక్షలు దాటితే కొనుగోలుదారులు తమ పాన్ వివరాలను ఇవ్వాల్సిందే.
- ప్రస్తుతం మోటర్ సైకిళ్ల కొనుగోలుకు పాన్ వివరాలతో పనిలేదు. అయితే ధరతో నిమిత్తం లేకుండా కార్లు ఇతరత్రా మోటర్ వాహన కొనుగోళ్లకు మాత్రం పాన్ ఉండాల్సిందే.
- హోటల్/రెస్టారెంట్ బిల్లులు, కన్వెన్షన్ సెంటర్లు లేదా బంకెట్ హాల్స్‌కు చేసే చెల్లింపులు, ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉన్న వ్యక్తి లక్ష రూపాయలకు మించి చెల్లిస్తే పాన్ వివరాలు పేర్కొనాల్సిందే.
- ఇప్పుడు హోటల్/రెస్టారెంట్ బిల్లులు రూ.50వేలు దాటినా పాన్ ఉండాల్సిందే.
- ఏ స్థిరాస్తికి చెందిన క్రయవిక్రయాలైనా లేదా బహుమతి, ఉమ్మడి అభివృద్ధి ఒప్పందాలకైనా ఆస్తి విలువ రూ.20 లక్షలు దాటితే ఇకపై పాన్ తప్పనిసరి.
- ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలు.
- ఏదైనా బీమా కంపెనీతో ఖాతా ఆధారిత లావాదేవీలు మొదలుపెట్టాలంటే ఇకపై పాన్ వివరాలు ఇవ్వాల్సిందే.
- ప్రస్తుతం జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 దాటితే పాన్ అవసరం అవుతున్నది.
- ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా అధికారిక వాహనాల కోసం ఇచ్చే పన్ను రహిత ప్రోత్సాహకాలు, ఉచిత భోజనాల విలువను పెంచారు.
- ఉద్యోగికి కంపెనీ ఉచిత భోజనంతోపాటు ఆల్కహాల్‌లేని పానీయాలను అందిస్తే దాని ధరను రూ.200గా నిర్ణయించారు.
- 1.6 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం కంటే తక్కువగా ఉన్న మోటర్ కార్లకు నెలకు అలవెన్స్ (డ్రైవర్లకు ఇచ్చేది కలిపి) రూ.8 వేలు. మిగతా వాటికి రూ.10 వేలు.
- హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత ఉన్న మెట్రో నగరాల్లో హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో నివసిస్తున్నవారికే వర్తిస్తున్నది.
- ఐటీ శాఖతో క్రిప్టో ఎక్సేంజీలు తప్పనిసరిగా సమాచారాన్ని పంచుకోవాలి.
- ఎలక్ట్రానిక్ పేమెంట్ పద్ధతిలోకి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ).
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

