జిన్నారం, ఏప్రిల్ 19: వరంగల్ జిల్లాలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీలోని పులిగిల్ల ఫంక్షన్హాల్లో ఏర్పా టు చేసిన జిన్నారం మండలం బొల్లారం, గడ్డపోతారం మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గులాబీ జెండాను ఆవిషరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సాధనే ధ్యేయ ంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిన్నారం మండ లం నుంచి 400 మంది, బొల్లారం మున్సిపాలిటీ నుంచి 300 మందిని వాహనాల్లో తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్కు అడ్డా అని గుర్తుచేశారు. మూడు సార్లు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసినట్లు తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రాన పార్టీ బలహీన పడదన్నారు. పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి సరార్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి సత్తా చాటుతామన్నారు. జిన్నా రం మాజీ జడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి మాట్లాడు తూ… కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. రాష్ట్ర యువత నాయకుడు వెంకటేశంగౌడ్ మాట్లాడుతూ… మళ్లీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. అనంతరం వరంగల్ సభ పోస్టర్‌ను ఆదర్శ్‌రెడ్డి ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి, అంజయ్య యాదవ్, పృథ్వీరాజ్, మణిక్ యాదవ్, రాజేశ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.