కొల్చారం, అక్టోబర్ 11: దుండగులు గిరిజన మహిళపై హత్యాచారానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా అప్పాజిపల్లి శివారు ఏడుపాయలకు వెళ్లే మార్గంలో ఓ ప్లాట్ వెనుక శనివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. అటుగా వెళ్లిన కొందరు వ్యక్తులు ఓ మహిళను వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి ఉన్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నర్సాపూర్ డీఎస్పీ ప్రసన్నకుమార్, కొ ల్చారం ఎస్సై మొయినొద్దీన్, పాపన్నపేట్ ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ ఉన్న మహిళను పోలీసు వాహనంలో మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకా రం… మెదక్ మండలం జానకంపల్లి పం చాయతీ పరిధిలోని సంగాయిగూడ తం డాకు చెందిన గిరిజన మహిళ శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి మెదక్‌లోని అడ్డా కూలికి వెళ్లింది. అక్కడ దుండగులు ఆమెను ఏడుపాయల వైపు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి హత్యాయత్నానికి పాల్ప డి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మహిళను వివస్త్రను చేసి రెండు చేతులు కట్టేసి ఆమెపై దాడికి లైంగిక దాడికి పాల్పడడంతో అపస్మారక స్థితికి చేరింది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. భర్త, బాధి త మహిళ బంధువులు దవాఖానకు వ చ్చారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.