C-Vigil | మెదక్‌రూరల్, అక్టోబర్ 19: ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రస్తుతం ఈ యాప్ ఆధునీకరణతో పాటు ఫ్లయింగ్ స్కౌడ్తో అనుసంధానం చేసింది. అక్రమాలకు సంబంధించిన ఫొటో యాప్‌లో అప్లోడ్ చేస్తే 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసిన ఫిర్యాదు దారుడికి సమాచారం తెలియజేస్తారు. ఈ సమాచారం జిల్లా ఎన్నికల అధికారితోపాటు నియోజకవర్గ పరిధిలోని ఫ్లయింగ్ స్కౌడ్కు చేరుతుంది. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘంచినా, వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతుల వంటివి ఇచ్చి ప్రలోభాలకు గురిచేసినా ఈ వివరాలను నేరుగా యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఎన్నికల ప్రచారంలో అనుమతులు లేకుండా లైడ్ స్పీకర్ వాడటం ఇతర నిబంధనలు ఉల్లంఘించినా, కులమతాలను రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేసినా, ర్యాలీలు తీసినాన ఈ యాప్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.
స్మార్ట్ ఫోన్లలో సీవిజిల్ యాప్‌లో కేంద్ర ఎన్నికల సంఘానికి కోడ్ ఉల్లంఘనపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. స్మార్ట్ఫోన్లలో సీవిజల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. బాషను ఎంపిక చేసుకుని టీక్ చేయమని సూచిస్తుంది. అనంతరం ఈ యాప్ మీ స్మార్ట్ ఫోన్లలో స్క్రీన్‌పై కనిపిస్తుంది . ఆ తర్వాత సెల్‌ఫోన్ నంబర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అఫ్ ఇండియా నుంచి ఎస్ఎంఎస్ ద్వారా 4 అంకెలతో కూడిన నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ సెల్ఫోన్లో ఎంటర్ చేసిన అనంతరం వినియోగదారుడికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. అనంతరం మీ ఫోన్లో యాప్ ఓపెన్ అవుతుంది. మీ పరిధిలోని కోడ్ ఉల్లంఘనపై ఫొటో లేదా వీడియోలు యాప్‌లో అప్లోడ్ చేస్తే ఫిర్యాదు అందిన 10నిమిషాల్లో ఎన్నికల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు. ఈ యాప్ గురించి ఇతర వివరాలకు 1950కి కాల్ చేయవచ్చు
ఎన్నికల నియమ నిబంధనలను రాజకీయ పార్టీలు ఉల్లంఘిస్తే సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చ. ఈ విషయం ఎన్నికల అధికారులకు సమాచారం అందిస్తారు. పది నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరుకునే విధంగా మండలస్థాయి ఫ్లయింగ్ అధికారులకు సమాచారం అందజేస్తారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు. ఈ సీవిజిల్ యాప్ గురించి గ్రామాల్లో గోడ పత్రికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాం