చేర్యాల, డిసెంబర్ 16 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం సందర్భంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పా టు చేస్తున్నామని అడిషనల్ డీసీపీ మహేందర్ తెలిపారు. శుక్రవారం మల్లన్న క్షేత్రంలో అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ ఏసీపీ ఫణీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రఘుపతిరెడ్డితో కలిసి తోటబావి, పరిసర ప్రాంతాలు వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్, దర్శన ప్రదేశాలను పరిశీలించడంతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా సీపీఐ ఆదేశాల మేరకు బందోబస్తున్న 4 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. తోట బావి కల్యాణ వేదిక, టెంపుల్ ఆవరణ, ట్రాఫిక్, పార్కింగ్ ప్రదేశాలుగా విభజన చేసి భక్తులకు సేవలు అందించనుననట్లు చెప్పా రు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారులు కంట్రోల్ రూంలో అందుబాటులో ఉండి భక్తులకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కల్యాణ వేదిక వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ పార్కిం గ్ ప్రదేశాల్లో, టెంపుల ఆవరణలో 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముగ్గురు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్సైలు, 14మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్, మహిళ కానిస్టేబుళ్లు, మహిళ హోంగార్డులు, బీడీ టీమ్స్, యాక్సెస్ కంట్రోల్, రోప్ పార్టీలతో కలిసి మొత్తం 280 మందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఆయన వెంట చేర్యాల సీఐ శ్రీనివాస్, సిద్దిపేట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, గజ్వే ల్ ట్రాఫిక్ సీఐ తిరుపతి, కొమురవెల్లి ఎస్సై చంద్రమోహన్, ఈవో బాలాజీ, ఏఈవో అంజయ్య, డైరెక్టర్లు సిద్ధి రాములు, తిరుపతి, రఘవీర్, జడ్పీటీసీ సిద్ధప్ప పోలీస్ సిబ్బంది ఉన్నారు.
పార్కింగ్ ప్రదేశాలు