దుబ్బాక, ఆగస్టు 26: సీజనల్ వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్తోపాటు గ్రామాల్లో విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుబ్బాక వంద పడకల దవాఖానలో 15 రోజులుగా రోగుల సం ఖ్య పెరిగింది. ఇంతకు ముందు జనరల్ వార్డు లో 20 మందిలోపు ఇన్పేషంట్లు ఉండగా ఇప్పుడు విషజ్వరాలతో రోగుల సంఖ్య అధికమైంది.
ప్రస్తుతం ఉన్న జనరల్ వార్డులో 30 బెడ్లు సరిపోక మరో వార్డులో 20 బెడ్లు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. శస్త్రచికిత్సలు, ప్రసూతి అయిన వారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు దవాఖానలోని వెనుకభాగంలో మరోవార్డు కేటాయించారు. సోమవారం 230 మంది రోగులు ఓపీ ఉండగా, ఇందులో విషజ్వరాలతో 40 మంది ఇన్పేషంట్స్గా చేరారు.