జహీరాబాద్, ఆక్టోబర్ 1 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చీకూర్తి, అత్నూర్, ఖలీల్ఫూ ర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ వార్డు స్థానాల్లో తమకు రిజర్వేషన్ కేటాయించలేదని ఎస్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్నూర్లో 1375 మంది ఓటర్లు ఉండగా, అందులో 273 మంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు. 8 వార్డు సభ్యుల స్థానాలకు బీసీ జనరల్, బీసీ మహిళ, అన్ రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ మహిళలకు కేటాయించారు.
ఒక్క వార్డు స్థానానికి ఎస్సీలకు కేటాయించలేదు. చీకూర్తిలో 916 మంది ఓటర్లు ఉండగా, 260 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో 8 వార్డు సభ్యుల స్థానాల్లో బీసీ జనరల్, బీసీ మహిళ, అన్ రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ మహిళలకు కేటాయించారు. ఒక్క వార్డు స్థానానికి ఎస్సీలకు కేటాయించలేదు. ఖలీల్ఫూర్లో 879 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 199 మంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు.
ఈ గ్రామంలో కూడా వార్డు స్థానాలకు బీసీ జననర్, బీసీ మహిళ, అన్ రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ మహిళకు కేటాయించడంతో ఎస్సీలు మండిపడుతున్నారు. అధికారుల తప్పిదంతో ఎన్నడూ లేనివిధంగా వార్డు స్థానాల్లో తమకు రిజర్వేషన్ దక్కలేదని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాల్కల్ మండలంలోని హద్నూర్లో 1వ వార్డులో బీసీ ఓటర్లు ఉండగా, ఎస్సీ మహిళకు రిజర్వుడ్ చేశారు. ముర్తుజాపూర్లో 5వ వార్డు లో ఎస్సీ ఓటర్లు ఉంటే బీసీ మహిళకు కేటాయించడం హాస్యస్పదమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.