రాయపోల్ : పోలీస్ శాఖలో ఎస్సై (SI ), కానిస్టేబుల్ ( Constable candidates ) ఉద్యోగాలకు సిద్ధమవు తున్న అభ్యర్థులకు ప్రోత్సాహం అందించేందుకు శ్రీధర్ సీసీఈ, అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్ టెస్ట్ ( Scholarship test ) నిర్వహిస్తున్నట్లు అఖిల్ రాజ్ ఫౌండేషన్ సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల అధ్యక్షులు సొక్కం స్వామి తెలిపారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో ఎస్సై, కానిస్టేబుల్ స్కాలర్షిప్ టెస్ట్ గోడ ప్రతులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు నగదు బహుమతులతో పాటు కోచింగ్ ఫీజులో ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థికి రూ. లక్ష, 21 మంది ప్రతిభావంతులకు నగదు బహుమతులు, రాష్ట్రవ్యాప్తంగా ఎంపికయ్యే వెయ్యి మంది అభ్యర్థులకు స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. అదనంగా మెరిట్ ఆధారంగా కోచింగ్‌లో రాయితీలు, ఉచిత మెటీరియల్, ఇతర ప్రోత్సాహకాలు కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఈ నెల 28న ఉదయం 10:00 గంటలకు వాగ్దేవి జూనియర్ కళాశాల బజాజ్ షోరూం దగ్గర ముస్తాబాద్ రోడ్డు దుబ్బాక , స్నేహ జూనియర్ , డిగ్రీ కళాశాల రామాయంపేట కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు సమీప పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకుని ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 76808 87711, 76808 87722 నెంబర్లకు సంప్రదించగలరన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల్ రాజ్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు దాతర్ పల్లి భాస్కర్, రాంపల్లి సతీష్, పోతరాజు శ్రీనివాస్, ప్రవీణ్, సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.